రిలీఫ్: తగ్గిన వంట గ్యాస్ ధరలు

Friday, February 1, 2019 07:00 AM News
రిలీఫ్: తగ్గిన వంట గ్యాస్ ధరలు

వంట గ్యాస్ ధరలు మరోసారి తగ్గాయి. నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై 30 రూపాయలు తగ్గింది. 14 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై కేవలం ఒక రూపాయి 46 పైసలు తగ్గించారు. ఈ ధరలతో.. 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.493.53 కు చేరుకుంది. గతంలో ఈ ధర రూ. 494.99 పైసలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడమే ఇందుకు కారణం అని చమురు కంపెనీలు తెలిపాయి. అయితే వంట గ్యాస్ ధరలు తగ్గించి బడ్జెట్ ముందు ప్రజలకు ఊరట ఇచ్చారు అని తగ్గించిన ధరలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు.

ధరలు తగ్గడం ఇది వరుసగా మూడోసారి
2018 డిసెంబర్ 1వ తేదీన రూ.6.52 పైసలు తగ్గింపు.
జనవరి 1వ తేదీన రూ.5.91 పైసలు తగ్గింపు.
ఢిల్లీలో 14.2 కిలోల నాన్ సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.659

For All Tech Queries Please Click Here..!