ప్రత్యేక హోదా ఇవ్వం : కేంద్రం స్పష్టీకరణ

Tuesday, December 18, 2018 02:48 PM News
ప్రత్యేక హోదా ఇవ్వం : కేంద్రం స్పష్టీకరణ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాకేజీ ఇప్పటికే ప్రకటించామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సమాధానమిచ్చింది. ప్రత్యేక హోదాపై తెదేపా సభ్యడు రవీంద్రకుమార్‌ రాజ్యసభలో ప్రశ్న అడిగారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇప్పటికే ప్రకటించామని కేంద్రం తెలిపింది. విదేశీ సంస్థల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. 14 వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అమలులో లేదని తెలిపింది.