నెలకు రూ.15వవేల కంటే తక్కువ సంపాదిస్తున్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్ !

Friday, February 1, 2019 02:46 PM News
నెలకు రూ.15వవేల కంటే తక్కువ సంపాదిస్తున్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్ !

ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారుల సంఖ్య 2 కోట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న గ్యాట్యుటీ పరిమితిని రూ. 10 లక్షల నుండి రూ. 30 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా దేశంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందు కోసం నెలకు రూ. 15 వేల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నవారికి నూతన పెన్షన్ విధానం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం క్రింద కనీసం పెన్షన్ రూ. 3,000 చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ పథకం కోసం రూ.500 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భవన నిర్మాణం, వీధి వ్యాపారులు,  వంటివారు దీనివల్ల ప్రయోజనం పొందుతారన్నారు.

For All Tech Queries Please Click Here..!