పెథాయ్ తుఫాన్ : ఏడు జిల్లాలపై ప్రభావం

Monday, December 17, 2018 10:03 PM News
పెథాయ్ తుఫాన్ : ఏడు జిల్లాలపై ప్రభావం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు జిల్లాలపై పెథాయ్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా పలు రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే 11 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అటు సామర్లకోట రైల్వేస్టేషన్‌లో మెయిల్‌, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌‌ను నిలిపివేశారు. అలాగే విశాఖ నుంచి రాజమండ్రి, కాకినాడ వెళ్లే బస్సులను అధికారులు రద్దు చేశారు.