2019 ఎన్నికల్లో పోటీపై పవన్ వ్యాఖ్యలు

Thursday, December 6, 2018 02:09 PM News
2019 ఎన్నికల్లో పోటీపై పవన్ వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది ఫిబ్రవరిలో ప్రకటిస్తానని జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్ స్పష్టం చేశారు. నేతలంతా వారి అవసరాలకు తప్ప ప్రజల కోసం పార్టీలను నడపటం లేదని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో కరవు నివారణకు సమగ్ర ప్రణాళిక అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌ అసెంబ్లీకి వెళ్లడం లేదని విమర్శించారు. జిల్లాలో కరవు సమస్యపై ఎందుకు ప్రశ్నించడం లేదని జగన్‌ను పవన్‌కల్యాణ్‌ నిలదీశారు.