బ్యాంక్, పోస్టాఫీస్ నుంచి డబ్బు తీస్తే ఇంక ట్యాక్స్ బాదుడే..!

Monday, September 2, 2019 04:20 PM News
బ్యాంక్, పోస్టాఫీస్ నుంచి డబ్బు తీస్తే ఇంక ట్యాక్స్ బాదుడే..!

కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఖాతాదారులకు షాకిచ్చింది. బ్యాంక్ లేదా పోస్టాఫీస్ నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తే పన్ను కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. ఏ బ్యాంక్ కస్టమర్‌కు అయినా ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించి ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బ్యాంక్, పోస్టాఫీస్ నగదు ఉపసంహరణ అంశం గురించి స్పందించింది. 2019 ఆగస్ట్ 31 నాటికి క్యాష్ విత్‌డ్రాయెల్స్ విలువ రూ.కోటి లేదా ఆపైకి చేరితే..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తదుపరి అన్ని క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై 2 శాతం టీడీఎస్ పడుతుందని వివరణ ఇచ్చింది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వుం తన బడ్జెట్‌లోనే క్యాష్ విత్‌‌డ్రాయెల్స్ (రూ.కోటి, ఆ పైన) 2 శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) విధిస్తామని ప్రతిపాదించింది. క్యాష్ లావాదేవీలు తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇది సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ‘బ్యాంక్, కో ఆపరేటివ్ బ్యాంక్, పోస్టాఫీస్ వంటి వాటిల్లో అకౌంట్లు కలిగిన వారు ఒకటి లేదా ఎక్కువ అకౌంట్ల నుంచి ఆగస్ట్ 31 నాటికే రూ.కోటికి పైగా డబ్బు విత్‌డ్రా చేసి ఉంటే.. తర్వాత అన్ని లావాదేవీలపై 2 శాతం టీడీఎస్ కట్ అవుతుంది’ అని సీబీడీటీ వివరించింది.

For All Tech Queries Please Click Here..!
Topics: