హైదరాబాద్ లో మళ్లీ కరోనా అలజడి, కొంప ముంచిన కామన్ టాయిలెట్..!

Sunday, May 17, 2020 11:22 AM News
హైదరాబాద్ లో మళ్లీ కరోనా అలజడి, కొంప ముంచిన కామన్ టాయిలెట్..!

గ్రేటర్‌ హైదరాబాద్ లో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఇక్కడ కరోనా బాధితులు పెరగడంతో పాటు కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా రెట్టింపవుతోంది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 60కిపైగా కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి. వీటిలో శనివారం నాటికి ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, ఖైరతాబాద్‌ జోన్ల పరిధిలోనే 50కిపైగా ఉండటం గమనార్హం.

ఇప్పటి వరకు వ్యక్తిగత నివాసాల్లో ఉండేవారికే కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. కేవలం వ్యక్తిగత నివాసాలకే కంటైన్మెంట్‌ పరిమితం చేశారు. తాజాగా అపార్ట్‌మెంట్‌ వాసుల్లోనే వైరస్‌ వెలుగు చూస్తోంది. అపార్ట్‌మెంట్‌లోని ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా అదే భవనంలోని 50 నుంచి 100 కుటుంబా లు చిక్కుల్లో పడాల్సివస్తోంది అని అధికారులు చెప్తున్నారు.

ఇటీవల గడ్డిఅన్నారం తిరుమలానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తి ద్వారా అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తొమ్మిది మంది కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆ భవనం ఉంటున్న వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. తాజాగా మాదన్నపేటలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో 23 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మరో 50 కుటుంబాల వరకు క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.

అధికారులు అపార్ట్‌మెంట్‌ను మొత్తం కంటైన్మెంట్‌గా ప్రకటించి, రాకపోకలను నిషేధించారు. మోతీనగర్‌ డివిజన్‌లో ఒకటి, అల్వాల్‌ కాణాజిగూడలో మరొకరికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్లుగా ప్రకటించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: