ఇలా చేస్తే పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉంటారట, మండిపడుతున్న తల్లిదండ్రులు

Friday, October 4, 2019 05:00 PM News
ఇలా చేస్తే పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉంటారట, మండిపడుతున్న తల్లిదండ్రులు

విద్యార్థులు పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండేందుకు ఓ టీచర్‌ వెరైటీ మెథడ్ ఫాలో అయ్యాడు.విద్యార్థులు పరీక్షలో చీటింగ్‌కు  పాల్పడకుండా ఉండేందుకు టీచర్‌ వారి తలలపై  కార్డ్ బోర్డు బాక్సులు ఉంచాడు. అయితే ఈ విధానం ఇప్పుడు అనేక విమర్శల పాలవుతోంది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ టీచర్‌ తన విద్యార్థులను ఇలా అవమానపరచడం సరైనదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకెళితే..
సెంట్రల్‌ మెక్సికోలోని బాచిల్లెరెస్ 01 ఎల్ సబినల్ స్కూల్‌లో లూయిస్ జ్యూరెజ్‌ టెక్సిస్‌ అనే టీచర్ పరీక్షల్లో విద్యార్థులు కాపీలు కొట్టకుండా ఉండేందుకు వాళ్ళ తలల మీద కార్డ్ బోర్డు బాక్సులు బోర్లించాడు. వాళ్ళు అటు,ఇటు దిక్కులు చూడకుండా..కేవలం టేబుల్ మీది కాగితం పైనే దృష్టి నిలపడానికి ఈ ఏర్పాటు చేశారట. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ టీచర్‌ తన విద్యార్థులను ఇలా అవమానపరచడం సరైనదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే లూయిస్‌ జ్యూరెజ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థులు అట్ట పెట్టలు పెట్టుకుని పరీక్ష రాస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం, ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్కూల్‌ యాజమాన్యం స్పందించింది. విద్యార్ధుల మానసిక పరివర్తనకు ఇది ఒక వ్యాయామం లాంటిదని తెలిపింది. విద్యార్థులు ఈ వ్యాయామానికి ముందే అంగీకరించారని చెప్పింది. తాము ప్రతి ఒక్కరి హక్కులను గౌరవిస్తామని పేర్కొంది.  అయితే ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది తెలియరాలేదు. తాము మానవతా విలువలను, వ్యక్తుల హక్కులను గౌరవిస్తామని వివరణ ఇచ్చుకుంది. 

కాగా-బ్యాంకాక్ లో ఓ యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఇలాంటి ‘ పరీక్షే ‘ పెట్టారు. వాళ్ళు ఎగ్జామ్స్ లో చీటింగ్ చేయకుండా టీచర్లు స్పెషల్ ‘బ్లింకర్లను ‘ వారి నెత్తిమీద పెట్టారు.. మరి ఇలాంటి పోకడలకు ప్రభుత్వ లేదా అధికారుల ఆమోదం గానీ, పర్మిషన్ గానీ ఉందా అన్నది తెలియడంలేదు. 

For All Tech Queries Please Click Here..!