#BREAKING: మాట వినకుంటే కనిపిస్తే కాల్చివేయమని చెబుతాం.. సీఎం కేసీఆర్ సంచలనం!

Tuesday, March 24, 2020 08:07 PM News
#BREAKING: మాట వినకుంటే కనిపిస్తే కాల్చివేయమని చెబుతాం.. సీఎం కేసీఆర్ సంచలనం!

తెలంగాణాలో  కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్ష జరిగింది. మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించిన తరువాత ఆయన  కలెక్టర్లు, ఎస్పీ, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్లు, ఎస్పీ, పోలీస్ కమిషనర్ లతో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రజాస్వామ్య దేశం కాబట్టి మెత్తగా చెప్తున్నామని అయినా సరే మాట వినకపోతే కఠినంగా వ్యవహరించక తప్పదని సీఎం కేసీఆర్ గారు చెప్పినట్లు తెలుస్తోంది.

రాష్ట్రాన్ని రక్షించుకునే దిశలో ఏ నిర్ణయం అయినా తీసుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నట్టు చెబుతున్నారు. మాటవినకపోతే 24 గంటల కర్ఫ్యూ తప్పదనీ, అదీ కూడా వినకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసేందుకు కూడా వెనుకాడమని ఆయన పేర్కొన్నట్టు చెబుతున్నారు. ఆర్మీని దింపడం తప్పదని, సమాజానికి ఇబ్బందులు వచ్చేలా ప్రవర్తిస్తే వారికి ఉన్న అన్నీ లైసెన్సులు రద్దు చేయబడతాయని సీఎం పేర్కొన్నట్టు చెబుతున్నారు. ఇక గృహ నిర్భందంలో ఉన్న వారి పాస్‌పోర్టులు కలెక్టరేట్‌లో పెట్టుకోవాలని జిల్లాల కలెక్టర్లను కేసీఆర్ ఆదేశించినట్టు చెబుతున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: