మనవాళ్ల ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌, 40 వేల మందికి తప్పని ఉద్వాసన ..!

Wednesday, April 1, 2020 07:45 AM News
మనవాళ్ల ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌, 40 వేల మందికి తప్పని ఉద్వాసన ..!

కరోనా దెబ్బకు అందరిలో డాలర్‌ కల చెదురుతోంది. అమెరికాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు, ఆర్థిక మందగమనం అక్కడి భారతీయ ఐటీ నిపుణులకు నిద్రలేకుండా చేస్తోంది. కరోనా నుంచి కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న మనవాళ్లు రానున్న  గడ్డు కాలాన్ని తలుచుకుని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ ఆర్థిక రాజధానిగా పేరొందిన న్యూయార్క్‌ నగరం కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. న్యూయార్క్, దాన్ని ఆనుకుని ఉన్న న్యూజెర్సీ లో 86,361 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీని బారిన పడ్డ వారిలో ఇప్పటికే 1,459 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్‌లోనే 38,087 మంది కరోనా బాధితులు ఉండగా, వారిలో 914 మంది మరణించారు.

గడిచిన 15 రోజులుగా న్యూయార్క్‌లో అన్ని వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ రెండు రాష్ట్రాలను లాక్ డౌన్ చేసి అక్కడకి వెళ్లొద్దంటూ అమెరికా ప్రభుత్వం పౌరులను హెచ్చరించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరో మూడు నెలల పాటు న్యూయార్క్‌లో పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో అక్కడ కార్యకలాపాలు నిర్వహించే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి అని సమాచారం. మార్చి నెలాఖరుతో కాంట్రాక్టు గడువు పూర్తయిన 40 వేల మందికి కంపినీలు గడువు పొడిగించలేదు. వీరిలో చాలామంది భారతీయులే. ఇప్పుడు ఉద్యోగాలు పోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

For All Tech Queries Please Click Here..!
Topics: