జ‌గ‌న్ చెప్పిన విష‌యాన్నే కుండ బద్దలు కొట్టి చెప్తున్న ప‌రిశోధ‌కులు!

Tuesday, April 28, 2020 09:56 PM News
జ‌గ‌న్ చెప్పిన విష‌యాన్నే కుండ బద్దలు కొట్టి చెప్తున్న ప‌రిశోధ‌కులు!

ఇండియా క‌రోనా ఫ్రీ కాదు.. ఇప్పుడ‌ప్పుడే వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశాలు లేవు.. క‌నీసం 18 నెల‌ల పాటు టీకా రాదు... అనేక మంది ఇండియ‌న్స్ కోవిడ్-19 బారిన ప‌డ‌తారు, కోలుకుంటారు..క‌రోనాను ఎదుర్కొంటూ జాగ్ర‌త్త‌గా బ‌త‌క‌డాన్ని నేర్చుకోవాలి.  కాస్త అటూ ఇటుగా జ‌గ‌న్ చెప్పిన విష‌యాన్నే ప్ర‌ముఖంగా పేర్కొన్నారు హిందుస్తాన్ టైమ్స్ జ‌ర్న‌లిస్టు ప్ర‌వీణ్ చ‌క్ర‌వ‌ర్తి. త‌న వ్యాసంలో ఎక్క‌డా ఏపీ ముఖ్య‌మంత్రిని కోట్ చేయ‌లేదాయ‌న‌, అయితే.. మ‌నం క‌రోనాతో క‌లిసి బ‌త‌క‌బోతున్నాం.. అని జ‌గ‌న్ ప్ర‌క‌టించే స‌రికి, తెలుగుదేశం-ప‌చ్చ‌బ్యాచ్- ప‌చ్చ‌చొక్కాల‌ను లోప‌ల దాచిన బ్యాచ్ లు గ‌గ్గోలు పెడుతున్నాయి. అయితే క‌రోనా కేసుల గురించి ఒక సుదీర్ఘ‌మైన ప‌రిశోధ‌న చేసిన జ‌ర్న‌లిస్టు ఇదే మాటే చెప్పాడు.

ఇక్క‌డ మ‌రో విశేషం ఏమిటంటే.. ప్రవీణ్ చ‌క్ర‌వ‌ర్తి రాసిన ఈ వ్యాసాన్ని.. కాంగ్రెస్ ముఖ్య‌నేత శ‌శిథ‌రూర్ త‌న ఫేస్ బుక్ వాల్ మీద‌కు షేర్ చేశారు. శ‌శిథ‌రూర్ ఒక‌వైపు క‌రోనా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎఫ‌ర్ట్స్ ను ప్ర‌శంసిస్తూ ఉన్నారు. ఇదే స‌మ‌యంలో క‌రోనా జీవ‌న శైలిలో భాగం కాబోతోంది, దాన్నుంచి దూరంగా ఉండ‌టం నేర్చుకోవాల‌న్న విష‌యాన్ని స్ట్రెస్ చేస్తూ.. శ‌శిథ‌రూర్ త‌న ఫేస్ బుక్ వాల్ మీద హిందుస్తాన్ టైమ్స్ ఆర్టిక‌ల్ ను షేర్ చేశారు.


 
ఇంతకీ ఈ వ్యాసంలో ఇంకా ఏం చెప్పారంటే...

-60 యేళ్ల లోపు ఉన్న వ్య‌క్తుల్లో వారిలో ఎలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ లు లేని వారిలో 99 శాతం మంది క‌రోనా సోకినా కోలుకోగ‌ల‌రు.

-ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ ప్ర‌కారం... క‌రోనా సోకిన 70 శాతం ఇండియ‌న్స్ లో ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌కు క‌న‌ప‌డలేదు. వారు క‌రోనా క్యారియ‌ర్స్ అయ్యారు. వారు త‌మ‌కు తెలీకుండానే క‌రోనా బారిన ప‌డి, కోలుకున్నారు.

-క‌రోనా కేసుల్లో మ‌ర‌ణాల శాతం భ‌య‌ప‌డినంత స్థాయిలో లేదు. సీవియ‌ర్ ఇన్ ఫ్లూయెంజా స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి.

-క‌రోనాను ఎదుర్కొన‌డంలో భార‌తీయుల‌కు ప్ర‌త్యేక వ్యాధినిరోధ‌క‌త ఉంద‌నేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. వాతావ‌ర‌ణం ద్వారా లేదా, జ‌న్యుప‌రంగా అలాంటి ఇమ్యూనిటీ ల‌భిస్తోంది అనేందుకు ఆధారాలు లేవు.

-మ‌రింత మంది భార‌తీయులు క‌రోనా వైర‌స్ కు గురి కాబోతున్నారు. వారు కోలుకుంటారు కూడా.

-18 నెల‌ల వ‌ర‌కూ క‌రోనాకు సరైన మందు వ‌స్తుంద‌ని చెప్ప‌లేం. అంత వ‌ర‌కూ లాక్ డౌన్ అనేది ప‌రిష్కారమూ కాదు, లాక్ డౌన్ మీద ఆధార‌ప‌డ‌లేం. 

-క‌రోనాతో క‌లిసి జాగ్ర‌త్త‌గా జీవించ‌డ‌మే మాత్ర‌మే ప్రాక్టిక‌ల్ ప‌రిష్కార మార్గం. (Learning to live cautiously w/the virus is the only pragmatic way)

ఇదీ స్థూలంగా ఒక జ‌ర్న‌లిస్టు రాసిన ప‌రిశోధ‌న‌. క‌రోనాతో క‌లిసి జీవించ‌డం అంటూ జ‌గ‌న్ వాడిన ప‌దాల‌నే ఆ జ‌ర్న‌లిస్టు కూడా వాడారు. లాక్ డౌన్ ప‌రిష్కారం కాద‌నే కీ వ‌ర్డ్స్ ను యూజ్ చేస్తూ శ‌శిథ‌రూర్ ఈ పోస్టును షేర్ చేశారు. జ‌గ‌న్ ను విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న వాళ్ల‌ను ఏదో క‌న్వీన్స్ చేయ‌డానికి ఈ క‌థ‌నాన్ని ప్ర‌స్తావించ‌డం లేదు. క‌రోనా ను త‌దుప‌రి ఎలా ఎదుర్కొనాల‌నే అంశం గురించి ప‌రిశోధ‌కులు ఏం చెబుతున్నార‌నే అంశాన్నే ఇక్క‌డ ప్ర‌స్తావించ‌డం జ‌రిగింది.

For All Tech Queries Please Click Here..!
Topics: