గుంటూరులో హైటెక్ వ్యభిచారం, 70 జంటలు అరెస్ట్

Monday, November 25, 2019 09:50 PM News
గుంటూరులో హైటెక్ వ్యభిచారం, 70 జంటలు అరెస్ట్

గుంటూరు పోలీసులకు ఎవరో కాల్ చేశారు. ఫలానా హోటళ్లలో వ్యభిచారం హ్యాపీగా సాగుతోందని చెప్పారు. అలర్టైన గుంటూరు జిల్లా ఎస్పీ... ఆర్డర్స్ జారీ చేశారు. అంతే... మొత్తం 50 మంది పోలీసులు రాత్రికి రాత్రి హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో జోరుగా తనిఖీలు చేశారు. బైపాస్ రోడ్డులోని విక్టరీ గ్రాండ్, అన్నపూర్న నిలయం లాడ్జిల్లో పోలీసుల దాడులు జరిగాయి. ప్రతీ తలుపూ తట్టారు. ఈ దాడుల్లో... చాలా చోట్ల వ్యభిచారం జరుగుతున్నట్లు తేలింది. మొత్తం 70 మంది జంటల్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిలో ఎంత మంది నిజమైన జంటలు, ఎంతమంది ప్రాస్టిట్యూటర్లు అన్నది పోలీసులు తేల్చనున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: