మందు తాగొస్తే ఓటు ఉండదు!

Thursday, December 6, 2018 03:34 PM News
మందు తాగొస్తే ఓటు ఉండదు!

మద్యం సేవించి వాహనం నడకూడదు... ఒక వేళ అలా తాగొచ్చి పోలీసులకు దొరికితే అంతే సంగతులు. బ్రీత్ అనలైజర్‌లో పరిమితి మించిన పాయింట్లు నమోదైతే... జరిమానా లేదా జైలు శిక్ష ఒక్కోసారి రెండూ వర్తిస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌కి ఓటింగ్‌కు మధ్య సంబంధమేంటి అనుకుంటున్నారా..? ఎన్నికల నియమావళిలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా తెలంగాణ ఎన్నికలతో ఎన్నడూ లేని విధంగా మద్యం తాగొస్తే ఓటు వేసేందుకు అనుమతించమని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.

ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మరియు ఎన్నికలను ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి, మద్యం సేవించి ఓటు వేయడానికి వెళితే పోలీసులు ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షిస్తారు. ఒక వేళ మద్యం మత్తులో ఉన్నారని తేలితే పోలింగ్ బూతులోకి అనుమతించరు మరియు మద్యం సేవించినట్లు తేలితే అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తారు.