నిర్భయ కేసు వాదించిన ఈ లాయర్ ఎంత ఫీజు తీసుకుందో తెలుసా?

Tuesday, March 24, 2020 12:36 PM News
నిర్భయ కేసు వాదించిన ఈ లాయర్ ఎంత ఫీజు తీసుకుందో తెలుసా?

నిర్భయ దోషులను ఉరి కంభం ఎక్కించడానికి భారతదేశం మొత్తం పోరాటం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో దోషులను వదిలిపెట్టకూడదని నిరసన వ్యక్తం చేసింది. ఆందులో నిర్భయ తల్లి ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసందే. మూడు సార్లు దోషుల ఉరి నిలిచినా ఆమె తన ధైర్యాన్ని వదులుకోలేదు. అయితే ఇందులో ఆశాదేవి వెనకున్న మరో మహిళ సీమా ఖుష్వాహ. నిర్భయ తరపున వాదించిన లాయర్. ఉత్తరప్రదేశ కు చెందిన సీమా ఖుష్వాహ అలహాబాద్ హై కోర్టులో బార్ సభ్యురాలిగా ఉన్నారు. కాగా 2012 లో నిర్భయ కేసుతో ఆమె సుప్రీం వరకు వెళ్లారు. నిర్భయ దోషులను శిక్ష నుండి తప్పించడానికి దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ చివరి వరకు ఈ కేసులో పోరాటం కొనసాగించారు.

ముఖ్యంగా దోషులకు శిక్ష వాయిదా పడుతూ వచ్చిన సందర్భాల్లో నిర్భయ తల్లి వెనకుండి సీమా ధైర్యం చెప్పారు. నిర్భయ కేసులో దోషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, చార్జ్ షీట్ దాఖలు చేయడం వంటి వాటిల్లో ఆమె తన మార్కును చూపించారు. చివరకు దోషులకు శిక్ష పడేలా చేసారు. నిర్భయ దోషులకు ఉరి అమలు కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసును ముందుండి నడిపించిన సీమా ఖుష్వాహ ను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. అయితే ఈ కేసు వాదించడానికి సీమా ఖుష్వాహ ఒక్క రోపాయి కూడా తీసుకోకపోవడం విశేషం. నిర్భయ లాంటి అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదనే మానవతా దృక్పథంతో ఆమె ఈ కేసును వాదించి గెలిచారు.

For All Tech Queries Please Click Here..!
Topics: