హైదరాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా..

Friday, May 15, 2020 11:28 AM News
హైదరాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా..

మాదన్నపేటలోని ఆర్‌ఆర్‌ మిడోస్‌ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న ఒకే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఆ కుటుంబంలో వృద్ధుడు(63), అతడి భార్య(62), వీరి కుమారుడు(37), ఇతడి 8, 4 ఏళ్ల కుమారులు, ఇంట్లో పనిచేసే మహిళ(34)కు వైరస్‌ సోకింది. ఇదే అపార్ట్‌మెంట్‌లో రెండో అంతస్తులో నివసిస్తున్న వ్యక్తికి ఈనెల 10నపాజిటివ్‌ రాగా, బుధవారం అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కూడా పాజిటివ్‌ అని తేలింది. అతడి భార్య, కూతురుతోపాటు 11 మందిని క్వారంటైన్‌కు తరలించగా వీరిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. 

మెహిదీపట్నంలోని సరోజినీదేవీ ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌కు పలువురు అనుమానితులను తరలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 147 మంది ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆస్పత్రి ఇన్‌చార్జ్జి డాక్టర్‌ అనురాధ తెలిపారు. చార్మినార్‌ యునానీ ఆస్పత్రిలో 44 మంది కరోనా అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచగా వారిలో ఇద్దరికి నెగెటివ్‌ రావడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. మిగిలిన 42 మంది చికిత్స పొందుతున్నారు. ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో ప్రస్తుతం 33 అనుమానిత కేసుల పరీక్షల నివేదిక రావాల్సి ఉందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌ నాయక్‌ తెలిపారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: