కరోనా వైరస్ టెస్ట్ కిట్స్, మేడిన్ ఏపీ, భారీగా కమర్షియల్ ఆర్డర్లు

Wednesday, April 8, 2020 08:14 AM News
కరోనా వైరస్ టెస్ట్ కిట్స్,  మేడిన్ ఏపీ, భారీగా కమర్షియల్ ఆర్డర్లు

కరోనా వైరస్ ని గుర్తించడానికి ఉద్దేశించిన టెస్ట్ కిట్స్ మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఈ కిట్స్‌ను ఆవిష్కరించనున్నారు అని సమాచారం. విశాఖపట్నంలోని మెడ్‌టెక్ జోన్‌లో కరోనా కిట్స్ తయారీని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఆరంభించింన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కిట్స్ తయారీ ఊపందుకున్నాయని. మరో 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 19వ తేదీన తొలి కిట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించే అవకాశం ఉంది అని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర అవసరాల కోసం కిట్ల తయారీ కొనసాగుతోందని, వచ్చే వారం నుంచి కమర్షియల్ ప్రొడక్షన్‌ను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. టెస్ట్ కిట్స్‌తో పాటు వెంటిలేటర్లను కూడా పెద్ద సంఖ్యలో తయారు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇదివరకే 30 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

For All Tech Queries Please Click Here..!
Topics: