ఆ ఎమ్మెల్యే తల నరికి తెచ్చిస్తే 50 లక్షలిస్తా!

Friday, January 25, 2019 05:43 PM News
ఆ ఎమ్మెల్యే తల నరికి తెచ్చిస్తే 50 లక్షలిస్తా!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార బీజేపీ మహిళా ఎమ్మెల్యే సాధనా సింగ్. ఇటీవల బీఎస్పీ అధినేత్రి మాయావతిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. మాయావతి ఆడనా.. మగనా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.


ఈ నేపథ్యంలో సాధనా సింగ్‌పై బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే విజయ్ యాదవ్ ఘాటుగా విమర్శలు చేశారు. తమ పార్టీ అధినేత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సాధనా సింగ్ తల తెగనరికి తెచ్చినవారికి రూ. 50 లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించారు. దీంతో ఆయనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

For All Tech Queries Please Click Here..!