తెలంగాణలో మరో ఇద్దరికీ కరోనా, సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి కూడా.

Thursday, March 26, 2020 01:08 AM News
తెలంగాణలో మరో ఇద్దరికీ కరోనా, సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి కూడా.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి నాటికి 39 పాజిటివ్ కేసులు కాగా బుధవారం నాటికి 41కి చేరాయి. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించిన.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ధ్రువీకరించారు. అతనితో ప్రైమరీ కాంటాక్ట్‌‌లో ఉన్న మహిళకు కూడా వైరస్ సోకింది. వీరిద్దరితో తెలంగాణాలో వైరస్ సోకిన వారి సంఖ్య 41కి చేరింది. ఇప్పటికే పరీక్షలు చేసిన 114 మంది రిపోర్ట్ రావాల్సి ఉంది. వారి నివేదిక తర్వాత పరిస్థితిపై స్పష్టత రానుంది. వైరస్ సోకిన వారిని ఇప్పటికే ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Topics: