పొట్టి నిక్కర్లు వేసుకుని పిచ్చెక్కిస్తున్న అనసూయ: వీడియో

Monday, April 6, 2020 01:00 PM Entertainment
పొట్టి నిక్కర్లు వేసుకుని పిచ్చెక్కిస్తున్న అనసూయ: వీడియో

లాక్ డౌన్ కావడంతో సెలబ్రిటీస్ కూడా ఇంట్లోనే ఉంటూ తమకి నచ్చిన పనులు చేసుకుంటున్నారు. బుక్స్ చదవడం, సినిమాలు చూడటం, ట్రెండీ బట్టలు ట్రై చేయటం ఇతర ఇతర పనుల్లో ఉండిపోతున్నారు. ముఖ్యంగా అనసూయ, రోజా, సుమ లాంటి వాళ్లు కూడా తాము సెలబ్రిటీస్ అనే విషయం మరిచిపోయి తల్లి అనే విషయం గుర్తు తెచ్చుకుని హాయిగా ఇంటి పనులతో మంచి వంటలు వండిపెడుతూ పిల్లలతో గడిపేస్తున్నారు.

ఇంట్లో పిల్లలు ఏది అడిగితే అది చేసి పెడుతున్నారు. మరికొందరు అయితే హాయిగా ఇంట్లోనే ఉండి డాన్సులు చేస్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ రెండూ చేస్తుంది. ఇంటి పనులు చేస్తూనే డాన్సులు కూడా చేస్తుంది. ఆడుతు పడుతు పని చేస్తే ఆ మజానే వేరు అంటుంది అనసూయ. అంట్లు తోముకుంటూ కూడా అదిరిపోయే డాన్సులు చేసి ఫ్యాన్స్ కి కిక్కు ఇస్తోంది. దానికితోడు చిన్నచిన్న షార్ట్స్ వేసుకుని పిచ్చెక్కిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయ డాన్సులు చేస్తూ గిన్నెలు కడుగుతుంటే ఆమె భర్త భరద్వాజ్ ఇల్లు క్లీన్ చేస్తూ సాయం చేస్తున్నాడు. మొత్తానికి ఈ లాక్ డౌన్ పీరియడ్ అంతా ఇంట్లోనే ఉండి హాయిగా అలా కానిచ్చేస్తున్నారు మన స్టార్స్.

For All Tech Queries Please Click Here..!
Topics: