లాక్‌డౌన్‌ ఎత్తేస్తే ఇవి తప్పవు, సమగ్ర నివేదిక..

Tuesday, May 5, 2020 09:58 AM News
లాక్‌డౌన్‌ ఎత్తేస్తే ఇవి తప్పవు, సమగ్ర నివేదిక..

కరోనా కి వ్యాక్సిన్, మందు ల్లేవు. దాన్ని కట్టడి చేయడం ఒక్కటే మార్గం. లాక్‌డౌన్‌తో సాధారణ జనజీవనం స్తంభించింది. ఉపాధి అవకాశాల్లేక బతుకుదెరువు ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంపైనా, కొన్ని సడలింపులిచ్చి కొనసాగించడంపైనా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక లేదా సడలింపులిచ్చాక ఏం చేయాలనే దానిపై కొన్ని సాధారణ ప్రొటోకాల్స్‌ను నివేదిక ప్రస్తావించింది.

  • వైరస్‌ లింక్‌ను విచ్ఛిన్నం చేయడానికి కనీసం రెండు మీటర్ల భౌతికదూరం పాటించడం తప్పనిసరి.
  • భౌతికదూరాన్ని మార్కెట్‌ ప్రదేశాలు, కిరాణా దుకాణాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు తదితర చోట్ల అమలుచేయాలి.
  • వైరస్‌ వ్యాప్తి జరగకుండా చూసేందుకు ఫేస్‌మాస్క్‌ తప్పనిసరి చేస్తూ, ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలి.
  • 60ఏళ్లు పైబడిన, అలాగే ఇతరత్రా వ్యాధులున్న 50ఏళ్లు పైబడిన వారికి వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువ. వీరు ఇంటి నుంచే పనిచేయాలి. వీరిని క్రమం తప్పకుండా పరీక్షించాలి.
  • పార్కులు, సమావేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్రీడ, సంగీత ప్రదర్శనలు పూర్తిగా నిషేధించాలి, 60రోజులు లేదా వైరస్‌ మహమ్మారి తగ్గే వరకు వీటిని అనుమతించకూడదు.
  • అత్యవసర సేవల విషయంలో జిల్లా కలెక్టర్‌ 90రోజుల పాటు పాస్‌లు జారీచేయాలి.
  • ప్రజారవాణా సదుపాయం కల్పించాలి. భౌతికదూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించే ప్రయాణించాలి.
  • సీటింగ్‌ సామర్థ్యం మించకూడదు. పరిస్థితి తీవ్రంగా ఉన్నచోట ప్రజా రవాణా వాహనాల్లో సీటుకు ఒకరిని మాత్రమే అనుమతించాలి.
  • అవసరమైన వస్తువుల కోసం ఆన్‌లైన్‌ షాపింగ్‌ను అనుమతించవచ్చు.
  • ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో లాక్‌డౌన్‌ సమయంలో మాదిరిగానే చర్యలు చేపట్టాలి. జనాన్ని బయటకు రానివ్వకుండా చూడాలి.
  • వివాహాలు, అంత్యక్రియలకు సమీప బంధువులు హాజరుకావచ్చు, కానీ 20మందికి మించరాదు.
  • ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు 50శాతం రోస్టర్‌తో పనిచేయాలి. వారానికి ఐదు రోజుల పని విధానం అమలుచేయొచ్చు.
  • ప్రైవేటు ఆఫీసుల్లో షిఫ్ట్‌కు 70శాతం ఉద్యోగులనే అనుమతించాలి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువుంటే ఈ సంఖ్యను 50 నుంచి 20 శాతానికి తగ్గించాలి.
  • ఆఫీసుల్లో హ్యాండ్‌ వాషింగ్‌ సౌకర్యం, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
  • సాధారణ పరిస్థితి వచ్చే వరకు అంతర్జాతీయ, రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజల కదలికలపై పరిమితి విధించాలి.
  • అంతర్జాతీయ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించిన తరువాత.. ఏదైనా మార్గం ద్వారా ఎక్కడి నుంచైనా వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు జాతీయ మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్‌కు వెళ్లాలి.
  • కేసుల సంఖ్య, వ్యాప్తి, నిర్వహణ, వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు.. వీటి ఆధారంగా ప్రతి జిల్లాను నాలుగు రకాలుగా వర్గీకరించాలి. ఆ వర్గీకరణ ఆధారంగానే సడలింపులనివ్వాలి.
  • పరిస్థితిని బట్టి 30 నుంచి 90 రోజుల వరకు ఈ నిబంధనలు కొనసాగించాలి. ఆపై వైరస్‌ వ్యాప్తి తీవ్రతను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి.  

For All Tech Queries Please Click Here..!
Topics: