భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు పొంచివుంది.

Friday, May 29, 2020 01:43 PM News
భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు పొంచివుంది.

దేశంలో కరోనా అరికట్టడం కోసం అత్యవసరం కాని అన్ని ఎలక్టివ్‌ సర్జరీలను మార్చి 31వ తేదీ వరకు వాయిదా వేయాలంటూ కేంద్ర ప్రభుత్వం మార్చి 20వ తేదీన దేశంలోని ఆస్పత్రులకు, వైద్య సంస్థలకు సూచనలు జారీ చేసింది. మార్చి 30వ తేదీ వరకే కాకుండా నేటి వరకు కూడా దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గక పోవడంతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సంస్థలు అత్యవసరం కాని సర్జరీ కేసులను వాయిదా వేస్తూనే వస్తున్నాయి.

మే 31వ తేదీ నాటికి నాలుగవ దశ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఐదవ దశ లాక్‌డౌన్‌ను విధిస్తారా, లేదా? అన్న విషయంతో ప్రస్తుతానికి స్పష్టత లేదు.  లాక్‌డౌన్‌ను పొడిగించినా, లేకపోయిన వాయిదా వేస్తూ వస్తోన్న సర్జరీలను వెంటనే అనుమతించక పోయినట్లయితే వారిలో ఎంతో మంది మరణించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు 5.8 లక్షల ఎలక్టివ్‌ సర్జరీలను వాయిదా వేసినట్లు వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి.

 కార్డియాక్‌ సర్జరీలు : యాంజీయోగ్రాఫీ లేదా స్టెంట్లు వేయడానికి ముందుగానే ముందుగానే తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుంది. కొన్ని నెలలు ఆలస్యమైతే రోగి ప్రాణాలే పోవచ్చు.
క్యాన్సర్‌ : మొదట్లోనే గుర్తించి సర్జరీ చేస్తే నయం అవుతుంది. ఆలస్యం అయినకొద్దీ ముదిరి ప్రాణం మీదకు తెస్తుంది.
మధుమేహ రోగులకు అయిన గాయాలకు, ఇన్‌ఫెక్షన్లకు సకాలంలో వైద్య  పోయినట్లయితే ఇన్‌ఫెక్షన్లు తీవ్రమై శరీర అవయవాలను తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

For All Tech Queries Please Click Here..!
Topics: