భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు...

Monday, July 29, 2019 12:50 PM Lifestyle
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు...

గర్భం దాల్చటం అనేది దంపతులకి చాలా పెద్ద వరం లాంటిది. భార్య గర్భం దాల్చిన తరువాత భర్త కొన్ని పనులు చేయటం మంచిది కాదు అని మన పురాణాలు చెప్తున్నాయి. భార్య గర్భం దాల్చిన దగ్గర నుండి భర్త ఆమెను ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలి. భార్య గర్భిణీ సమయంలో తన భర్త ఎల్లప్పుడూ తనతోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది. భర్త కూడా తన భార్య తోనే ఎక్కువగా సమయం కేటాయిస్తే తల్లికి,పుట్టబోయే బిడ్డకు ఎంతో మంచిది. భార్య గర్భవతి గా ఉన్నపుడు తన కోర్కెలను తప్పకుండా భర్త తీర్చాలి.ఇలా చేయడం వల్ల కడుపులోని బిడ్డ ఎంతో ఆరోగ్యం గా పుడుతుంది. 

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి.

భార్య గర్భిణీ సమయంలో భర్త గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది.

భార్య గర్భవతి గా ఉన్నప్పుడు భర్త చెట్లను నరక కూడదు.

పాములను చంపకూడదు

వన్యప్రాణులను వేటాడి చంపడం చేయకూడదు.

భార్య గర్భవతి ఉన్నప్పుడు భర్త సముద్రంలో స్నానం చేయడం మంచిది కాదు.

శవాలను, శవపేటికలను అస్సలు మోయకూడదు.

భార్య కు 7 నెలలు నిండిన తర్వాత భర్త అస్సలు క్షవరం(గడ్డం) చేయించుకోకూడదు.

భార్య కు 7 నెలలు తర్వాత సముద్రంలో పక్కన ప్రయాణం చేయరాదు.

తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు చేయరాదు.

ఇంటి నిర్మాణం చేపట్టకూడదు

ఎటువంటి శంకుస్థాపన పనులు చేయరాదు.

పిండ ప్రదానం, పితృ కర్మలు చేయకూడదు.

For All Tech Queries Please Click Here..!
Topics: