భావప్రాప్తి పొందలేకపోతున్నారా? వీటిని ట్రై చేసి చూడండి..

Tuesday, August 6, 2019 08:20 PM Lifestyle
భావప్రాప్తి పొందలేకపోతున్నారా?  వీటిని ట్రై చేసి చూడండి..

శృంగార జీవితాన్ని ఆనందంగా గడపాలని అందరూ కోరుకుంటారు. అందరూ తమ జీవితభాగస్వామితో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు. అయితే మారుతున్న జీవన ప్రమాణాలు, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇలా చాలా కారణాల వలన కొందరు సంభోగ జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతున్నారు. మరికొందరిలో పూర్తిగా సంభోగ సామర్థ్యమే తగ్గిపోతోంది. అయితే వీటికి కొన్ని సింపుల్ చిట్కాలతో పులిస్టాప్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. మంచి ఆహారం తీసుకోవడం, మంచి ఎక్సర్ సైజులు చేయడం, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండటం లాంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని పాటిస్తే శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుంది అట.

అంతేకాదు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయాలని అనుకునేవారు రోజుకి 60గ్రాముల డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వాల్ నట్స్ సంభోగ సామర్థ్యం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయట. రోజుకి 60గ్రాముల నట్స్ తినేవారిలో శృంగార ఆసక్తి పెరుగుతుంది. వీటి వల్ల గుండెకి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నట్స్ లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అంగస్తంభన సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు.
 

For All Tech Queries Please Click Here..!
Topics: