రోజూ ఇవి తింటే, పడకపై పండగే.

Saturday, February 1, 2020 03:21 PM Lifestyle
రోజూ ఇవి తింటే, పడకపై పండగే.

ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్నవి లైంగిక సమస్యలు. పాతికేళ్ల వయసు వాళ్లకు కూడా లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఎదురుకుంటున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి అని డాక్టర్స్ అంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్, నిద్ర లేమి, వర్క్ టెన్షన్లు ఇలా చాలా. ఐతే సంతాన భాగ్యం కలగాలంటే నట్స్ తినడం బెస్ట్ రూట్ అంటున్నారు డాక్టర్లు. జీడిపప్పు, బాదం, ఆక్రోట్లు, కిస్‌మిస్ వంటి గింజలు, పప్పులను రెగ్యులర్‌గా తింటూ ఉంటే స్పెర్మ్ కౌంట్ పెరిగి. పిల్లలు పుట్టే అవకాశాలు మెరుగుపడతాయి.

నట్స్ తింటే మంచిదే. బట్ రోజూ ఎన్ని తింటే మంచిది అన్నది చాలా మందికి ఉండే పెద్ద ప్రశ్న. రోజూ 60 గ్రాముల పప్పులు (బాదం, జీడిపప్పు, ఆక్రోట్లు వంటివి) తింటే కొన్ని రోజుల్లోనే లైంగిక సామర్ధ్యం బాగా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. తాజా పరిశోధనకు సంబంధించిన వివరాల్ని న్యూట్రియంట్స్ జర్నల్‌లో రాశారు. నట్స్ రోజూ తింటూ ఉంటే స్పెర్మ్ (శుక్రకణాలు) కౌంట్ పెరగడమే కాదు. వీర్యం నాణ్యత కూడా పెరుగుతుందని తెలిసింది.83 మందిని రెండు గ్రూపులుగా విడగట్టి. వారిని 14 వారాలపాటూ అధ్యయనం చేశారు. వారిలో కొందరు కేవలం పండ్లు, కూరగాయలు, మాంసం వంటివి మాత్రమే తిన్నారు. మరికొందరు వాటితోపాటూ నట్స్ కూడా రోజూ తిన్నారు.నట్స్ తినని వారి కంటే నట్స్ రోజూ తినేవారికి లైంగిక సామర్ధ్యం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

Topics: