శృంగారం చేయండి.. కరోనాకు దూరమవ్వండి.. శ్రీ రెడ్డి సంచలనం..

Saturday, March 21, 2020 11:10 AM Entertainment
శృంగారం చేయండి.. కరోనాకు దూరమవ్వండి.. శ్రీ రెడ్డి సంచలనం..

ప్రపంచమంతా ఓ పనిమీద ఉంటే శ్రీ రెడ్డి మాత్రం మరో పని మీద ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా కూడా తన కాంట్రవర్సీలు మాత్రం తనకు కావాలంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలియక అంతా తలపట్టుకుని కూర్చుంటారు. ఈమధ్య కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చినా కూడా రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణి పుణ్యమా అని మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ సహా అందర్నీ మరోసారి ఏకిపారేసింది. ప్రపంచమంతా కరోనా భయంతో చచ్చిపోతుంటే ఇప్పుడు దీనిపై కూడా పిచ్చి పోస్టులు పెట్టింది శ్రీ రెడ్డి. అందులోనే మళ్లీ డబ్బున్నోళ్లను కూడా తీసుకొచ్చింది. శ్రీమంతులు వ్యభిచారం చేస్తే అది డేటింగ్ అవుతుంది. పెద్దొళ్లు ఎవరినైనా వాడుకుంటారు. రిచ్‌గా బతకండి. కరోనా, ఎయిడ్స్ వంటి వ్యాధులను కొని తెచ్చుకోండని ఈమె పోస్ట్ చేసింది. ఈ కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి పెట్టిందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కావాలనే చేసిందా.. లేదంటే కాంట్రవర్సీ కోసం అని చేసిందా అనేది తెలియాలి.

మరోవైపు కరోనాతో జాగ్రత్త అని ప్రభుత్వాలు హెచ్చరిస్తుంటే ఇప్పుడు దాన్ని కూడా తన పాపులారిటీ కోసం వాడేసింది శ్రీ రెడ్డి. మాస్క్‌లు ధరించండని ప్రభుత్వాలు కోరుతుంటే దాన్ని తన స్టైల్లో చెప్పింది ఈమె. మాస్క్‌లు ధరించండి. హెల్మెట్స్ ధరించండి. కండోమ్స్ వాడండి. కానీ దేవుడి ముందు మాత్రం నగ్నంగా ఉండండని సంచలన పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.

Topics: