రహస్యంగా పెళ్లి చేసుకున్న శ్రీరెడ్డి.. వరుడు ఎవరో తెలుసా..? (వీడియో)

Sunday, May 17, 2020 10:55 AM Entertainment
రహస్యంగా పెళ్లి చేసుకున్న శ్రీరెడ్డి.. వరుడు ఎవరో తెలుసా..? (వీడియో)

గత కొంత కాలంగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే శ్రీరెడ్డి సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందా, అంటే అవుననే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది . తాజాగా ఆమె విడుదల చేసిన ఓ టిక్ టాక్ వీడియోలో మెడలో తాళిబొట్టుతో, నుదుటన సింధూరంతో కనిపించింది.

శ్రీ రెడ్డి గతంలో కూడా తాను త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే హీరో నిఖిల్, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లిల్లు చేసుకున్నారు. అయితే తాజాగా వారి జాబితాలో శ్రీరెడ్డి కూడా చేరినట్లయ్యిందని నెటిజన్లు అంటున్నారు.

అయితే తనకు పెళ్లి కాలేదని ఇదంతా టిక్ టాక్ కోసమే అంటూ శ్రీరెడ్డి క్యాప్షన్ పెట్టింది. కానీ శ్రీరెడ్డి గతంలో ఓ రాజకీయ నేతకు భార్యగా ఉండేందుకు ఇష్టపడతానని పబ్లిగ్గా యూట్యూబ్ వీడియోలో స్టేట్ మెంట్ ఇచ్చేసింది. అయితే శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్ పై సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటోందని, అక్కడే ఓ యువ డైరక్టర్ తో పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు శ్రీరెడ్డి గతంలో కూడా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు కచ్చితంగా చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

@srireddym

still single pasanga..just an acting .. ##srireddyfans ##srireddym ##tamilnadu ##tamil ##sentiment ##tamiltraditional

♬ original sound - rubyrubini
For All Tech Queries Please Click Here..!
Topics: