రాహుల్ సిప్లిగంజ్-నందిని లిప్‌లాక్ ముద్దులు

Wednesday, April 29, 2020 04:59 PM Entertainment
రాహుల్ సిప్లిగంజ్-నందిని లిప్‌లాక్ ముద్దులు

బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్  ఇప్పుడు చాలా బిజీగా మారిపోయాడు. ఓ వైపు పాటలు పాడుతూ బిజీగా ఉంటూనే మరోవైపు నటనలోనూ రంగ ప్రవేశం చేశాడు. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతోన్న ‘రంగమార్తాండ’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో రాహుల్ నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నటి నందినీ రాయ్‌తో ఫుల్ రొమాన్స్ చేస్తున్న వీడియోను రాహుల్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో పంచుకున్నాడు. ఈ వీడియోలో ఇద్దరు లిప్ టు లిప్ కిస్ ఇస్తున్న సీన్ చూసుకుని నవ్వుకున్నారు. 

అయితే ఈ వీడియోను చూసిన అషూ చేసిన కామెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘వావ్ ఇది నేను చూడలే’ అని కామెంట్ చేసింది. దీనికి స్పందించిన రాహుల్.. ‘అబ్బో ఇక నేను చచ్చిపోతా’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి మళ్లీ స్పందించిన అషూ.. ‘మినిమమ్ ఉంటాయ్ కదా నీ వీడియోస్‌‌లో’ అంటూ నవ్వు ఎమోజీ జతచేసింది.

For All Tech Queries Please Click Here..!
Topics: