హల్‌చల్ చేస్తున్న మరో ఎన్టీఆర్.. ఆశ్చర్యపోతున్న తారక్ ఫ్యాన్స్..!

Monday, May 13, 2019 06:08 PM Entertainment
హల్‌చల్ చేస్తున్న మరో ఎన్టీఆర్.. ఆశ్చర్యపోతున్న తారక్ ఫ్యాన్స్..!

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. అది నిజమే కాదో తెలియదు కానీ అచ్చం జూనియర్ ఎన్టీఆర్‌ను పోలిన వ్యక్తి మరోకరు ఇప్పుడు కనిపించాడు. అతని పేరు షమీందర్ సింగ్, పంజాబ్‌కు చెందిన ఇతను ఏరోనాటికల్ ఇంజినీర్ చదువుతున్నాడు . అచ్చం తారక్‌ను పోలి ఉన్న ఈ వ్యక్తికి తెలుగు రాకపోయినా ఎన్టీఆర్‌కు వీరాభిమానట. అంతేకాదు ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను టిక్‌టాక్ ద్వారా వీడియో తీసి ట్విట్టర్‌లో తరుచుగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. దీంతో చాలా మంది ఎన్టీఆర్ ఈ వీడియోలను పోస్ట్ చేసారని అనుకున్నారు. తీరా ఇతను ఎన్టీఆర్‌ను పోలి ఉన్న షమీందర్ సింగ్ అని తెలిసి షాక్ అవుతున్నారు.

అంతేకాదు సోషల్ మీడియాలో చాలా మంది నన్ను ఎన్టీఆర్ అనుకొని నాకు మెసేజ్‌లు చేస్తున్నారు అని షమీందర్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ వచ్చి తారక్‌ను కలవాలని అతని కోరిక అని తెలిపారు, కానీ ఎక్కడ నన్ను తారక్ అనుకోని అభిమానులు చుట్టు ముడతారో అని షమీందర్ భయపడుతున్నాడట. 

For All Tech Queries Please Click Here..!