పూరి చేసిన పనికి హీరోయిన్ కేతిక శర్మ పంట పండింది!

Tuesday, March 24, 2020 03:12 PM Entertainment
పూరి చేసిన పనికి హీరోయిన్ కేతిక శర్మ పంట పండింది!

కేతిక శర్మ అందాలతో ఫిదా చేస్తోన్న ఈ భామను పూరి జగన్నాథ్.. తనయుడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు.  ఆకాష్ పూరి  హీరోగా  'రొమాంటిక్' అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమాలో కేతిక శర్మను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు కేతిక శర్మ 'రొమాంటిక్' సినిమాలో ఎలా కనిపించబోతోంది? తెలియదు కాని. సామాజిక మాధ్యమాల్లో మాత్రం కేతిక తన అంద చందాలతో అదరగొడూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

కేతిక తన సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇన్ స్టాగ్రమ్‌లో ఎప్పటికప్పుడు  కొత్త కొత్త ఫోటోలను, వీడియోల్ని అప్ లోడ్ చేస్తూ..అభిమానుల్ని అలరిస్తోంది. కేతిక పోస్ట్ చేస్తోన్న ఈ ఫోటోలను చూసిన పూరి అభిమానులు.. కేతిక విషయంలో పూరి సెలక్షన్‌.. సూపర్ అని తెగ పొగిడేస్తున్నారు.

Topics: