అందుకు బాల‌కృష్ణ ఒప్పుకుంటారా అన్నదే ప్రధాన ప్రశ్న?

Monday, March 23, 2020 11:01 AM Entertainment
అందుకు బాల‌కృష్ణ ఒప్పుకుంటారా అన్నదే ప్రధాన ప్రశ్న?

క‌థ న‌చ్చి ఒప్పుకుంటే ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో ఎటువంటి మార్పులు చేర్పులు అడగకుండా ముందుకెళ్లిపోయే హీరోల్లో బాల‌కృష్ణ ఒక‌రు. ఆయ‌న ప్ర‌స్తుతం త‌న 106వ సినిమాను బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సంగ‌తి మనకి తెలిసిందే. త‌దుప‌రి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నార‌ని సినీ వ‌ర్గాల లో టాక్ ఉంది.

కాగా, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ మ‌ధ్య మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’ సినిమా రీమేక్ హక్కులను సంపాదించుకుంది. ఇది రిటైర్డ్ హవల్దార్, ఓ పోలీస్ ఆఫీసర్ మ‌ధ్య న‌డిచే ఈగో వార్‌కి సంబంధించిన క‌థాంశంతో తెర‌కెక్కిన సినిమా. ఇందులో పాత్ర‌లను కుర్ర హీరోలు చేయ‌లేరు. ఇందులో ఓ పాత్ర‌లో బాల‌కృష్ణని పెట్టాలని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ మ‌ల‌యాళ రీమేక్‌లో న‌టించ‌డానికి బాల‌కృష్ణ ఒప్పుకుంటారో లేదో చూడాలి. 

Topics: