లాక్‌డౌన్‌లో పెంపుడు కుక్కతో ఎంజాయ్ చేస్తున్న ఛార్మి

Wednesday, April 29, 2020 09:55 AM Entertainment
లాక్‌డౌన్‌లో పెంపుడు కుక్కతో ఎంజాయ్ చేస్తున్న ఛార్మి

లాక్‌డౌన్‌ కారణంగా సాధారణ ప్రజానీకం నుండి సెలబ్రిటీల వరకూ అందరూ ఇళ్లలకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు తాము ఎలాంటి లైఫ్ గడుపుతున్నారో వారి రోజు వారీ పనుల తాలూకు ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్, నిర్మాత ఛార్మి తన పెంపుడు కుక్కతో కలిసి నిద్రిస్తున్న ఫొటోను తన ట్విట్టర్లో షేర్ చేసింది.

ఆ ఫొటోకి..‘‘మై క్వారంటైన్‌ పార్టనర్‌’’ అనే కొటేషన్ ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లైక్స్, కామెంట్స్ కూడా భారీగానే సంఖ్యలో వస్తున్నాయి. నటి నుండి నిర్మాతగా మారిన ఛార్మి ‘రొమాంటిక్’, ‘ఫైటర్‌’ అనే చిత్రాలను పూరి జగన్నాథ్‌తో కలిసి నిర్మిస్తోంది. పూరీ మరియు ఛార్మీల డైరక్షన్ మరియు ప్రొడక్షన్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

For All Tech Queries Please Click Here..!
Topics: