బెడ్ సీన్స్ లో అది ఉంటేనే, బోల్డ్ పాత్రలకు సిద్ధమే అంటున్న భూమిక..!

Thursday, May 7, 2020 10:38 AM Entertainment
బెడ్ సీన్స్ లో అది ఉంటేనే, బోల్డ్ పాత్రలకు సిద్ధమే అంటున్న భూమిక..!

ఖుషి సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీ లో అనేక మందిని ఆకర్షించిన బ్యూటీ భూమిక చావ్లా. ఆ సినిమా తరువాత గ్లామర్ గీత దాటకుండానే అమ్మడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి పాత్రలైన తనదైన శైలిలో చేసి సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించేది. సెకండ్ ఇన్నింగ్స్ లో కొన్ని ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్న భూమిక బోల్డ్ రోల్స్ పై తన అభిప్రాయాన్ని తెలిపింది. భూమిక మొదట సుమంత్ నటించిన యువకుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తరువాత మెల్లగా ఖుషి సినిమాతో సక్సెస్ అందుకొని ఇక్కడే స్థిరపడింది. తమిళ్ లో ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఎందుకో భూమిక తెలుగు సినిమాల వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించింది. హిందీలో అప్పుడప్పుడు స్పెషల్ రోల్స్ తో మెప్పించే ప్రయత్నం చేసింది.

వయసు 40 దాటినా కూడా భూమిక అంద చందాలలో పెద్దగా తేడా ఏమి రాలేదు. అప్పుడప్పుడు హాట్ స్టిల్స్ తో కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక బోల్డ్ రోల్స్ చేయడానికి కూడా తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదంటూ.. బెడ్ సీన్స్ కష్టమైనా.. ఆ మాత్రం ఉండకపోతే ఎలా అని సమాధానం ఇస్తోంది. కానీ అలాంటి సీన్స్ కథకు అవసరం అయితేనే నటిస్తాను అని భూమిక చెబుతోంది.

For All Tech Queries Please Click Here..!
Topics: