వెంకటేష్ బాలకృష్ణల వార్, భయాందోళనలో బయ్యర్లు..!

Wednesday, October 9, 2019 02:22 PM Entertainment
వెంకటేష్ బాలకృష్ణల వార్, భయాందోళనలో బయ్యర్లు..!

సంక్రాంతికి మహేష్‌బాబు అల్లు అర్జున్‌ ల సినిమాలకు సంబంధించిన వార్ ఫైనల్ కావడంతో ఈ రెండు భారీ సినిమాలలో ఏ సినిమా సంక్రాంతి విజేతగా మారుతుంది అన్న విషయమై ఇప్పటికే అనేక ఊహాగానాలు వస్తున్నాయి. సంక్రాంతికి జరగబోతున్న ఈ భారీ వార్ మధ్య ఇరుక్కోవడం ఇష్టంలేక చిత్ర నిర్మాతల చిత్రాలన్నీ డిసెంబర్‌ లో రెలీసుకి బారులు తీరుతున్నాయి. దీనితో డిసెంబర్‌ లో రాబోతున్న సినిమాల సంఖ్య పెరిగింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. నితిన్‌ భీష్మ రవితేజ డిస్కోరాజా సాయిధరమ్‌ తేజ్‌  ప్రతిరోజూ పండగే శర్వానంద్‌ 96 చిత్రాలు అన్ని డిసెంబర్‌ రేసులోనే వున్నాయి. అయితే సడన్‌గా వెంకటేష్, బాలకృష్ణ కె.ఎస్. రవికుమార్ ల మూవీలు డిసెంబర్‌ రేసులోకి రావడంతో ఇప్పుడు డిసెంబర్ లో రావలసి ఉన్న సినిమాలకు అడ్జస్ట్‌మెంట్‌ కుదరడంలేదు అన్న వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి దీపావళికి అనుకున్న 'వెంకీమామ' వాయిదా పడడం సంక్రాంతికి వస్తుంది అనుకున్న బాలకృష్ణ మూవీ ముందుకు జరిగి డిసెంబర్‌ కు వస్తున్న పరిస్థుతులలో కొన్ని సినిమాలు సంక్రాంతి తరువాత వచ్చే జనవరి 26 కు వాయిదా పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వచ్చే ఏడాది రాబోతున్న రిపబ్లిక్‌ డే ఆదివారం కావడంతో ఈసినిమాల నిర్మాతలు అందరు డిసెంబర్ పై పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ మధ్య తరహా సినిమాలను కొనుక్కున్న బయ్యర్లు బాలకృష్ణ వెంకటేష్ ల మధ్య జరగపోతున్న ఈ డిసెంబర్ వార్ ను చూసి తల పట్టుకున్తున్నట్లు టాక్.

For All Tech Queries Please Click Here..!
Topics: