క్యూట్ గా హాట్ ని పెంచేసింది ...!

Friday, June 14, 2019 01:00 PM Entertainment
క్యూట్ గా హాట్ ని పెంచేసింది ...!

మజ్ను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళం భామ అను ఇమ్మాన్యుయేల్ అతి తక్కువ సమయంలోనే అగ్రహీరోలు పవన్ కళ్యాణ్ (అజ్ఞాతవాసి) అల్లు అర్జున్ (నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా) సినిమాల్లో ఆఫర్లు పట్టేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత ఎంతో నమ్మకంపెట్టుకున్న శైలజారెడ్డి అల్లుడు కూడా ఫెయిల్ అయింది. దీంతో అను టాలీవుడ్ జర్నీ ఆగిపోయింది. అయితే ఈ హిట్లు ఫ్లాపుల గోలతో సంబంధం లేకుండా ఈ జెనరేషన్ హీరోయిన్ల లాగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తరచుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులను అభిమానులకి మరింత చెరువవుతుంది.

ఇప్పుడు హీరోయిన్స్ సోషల్ మీడియాలో తమ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. తాజాగా అను తన అభిమానులకోసం ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోకు 'ఓహ్ లెట్ ఇట్ రెయిన్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. మరి ఈ భామ ఏ ఊరిలో వర్షం పడాలని కోరుకుందో కానీ హైదరాబాద్ నగరంలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో వాన కురిసింది.

For All Tech Queries Please Click Here..!