నేను రెండో పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ నిజాలు వెల్లడించిన అమలాపాల్

Tuesday, March 24, 2020 01:50 PM Entertainment
నేను రెండో పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ నిజాలు వెల్లడించిన అమలాపాల్

ఏఎల్ విజయ్ తో విడిపోయిన తర్వాత తన రిలేషన్ కి సంబంధించిన ఏ విషయాన్ని బయటకిచెప్పలేదు అమలాపాల్. నటి అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకుందంటూ కొత్త భర్తతో లిప్ లాక్ కిస్ పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తను ప్రేమించిన ముంబై బెస్ట్ సింగర్ భవీందర్ సింగ్‌తో మూడు ముళ్లు వేయించుకుందని తెగ ప్రచారం జరిగింది. దీనిపై అమల్ కూడా స్పందించలేదు తాజాగా ఆమె ఓ తమిళ న్యూస్ చానెల్‌తో మాట్లాడింది.

తనరెండో పెళ్లి జరిగిందని వస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది.తాను రెండో పెళ్లి చేసుకోలేదని.. నెట్‌లో ఉన్న ఫోటోలు నేను భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ కోసం చేసిన ఫోటో షూట్‌ కోసం అని స్పష్టంచేసింది. అయితే గత కొద్ది రోజుల కింద ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే అందరికీ ముందే చెబుతానని పేర్కొంది. కాగా..చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.

Topics: