కాలం వేగంగా పరుగెడుతోంది.. కానీ ప్రేమ మాత్రం

Friday, March 6, 2020 03:49 PM Entertainment
కాలం వేగంగా పరుగెడుతోంది.. కానీ ప్రేమ మాత్రం

టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి వివాహ బంధానికి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బన్నీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లినాటి ఫోటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య స్నేహారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్. పెళ్లి ఫొటోను షేర్ చేసిన బన్నీ, ఆకర్షణీయమైన కోట్ పెట్టారు. తొమ్మిదేళ్ల వివాహబంధం. కాలం వేగంగా పరుగెడుతోంది. కానీ ప్రేమ మాత్రం రోజు రోజుకూ రెట్టింపవుతోంది అంటూ తన భార్య స్నేహారెడ్డిపై ప్రేమ కురిపించారు.

For All Tech Queries Please Click Here..!