డ్యాన్స్ చేయాలని ఒత్తిడి, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు

Monday, February 1, 2021 03:15 PM Crime
డ్యాన్స్ చేయాలని ఒత్తిడి, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు

Lucknow, Dec 14: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని బరేలీలో ఆలస్యంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం తాగిన పెళ్లి కొడుకు స్నేహితులు పెళ్లి కూతురు (Uttar Pradesh Bride) డ్యాన్స్ చేయాల్సిందేనని పట్టుబడటంతో వధువు తల్లిదండ్రులు కోపంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అలాగే వరుడి కుటుంబంపై అధికంగా కట్నం అడుగుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళితే.. కనౌజ్‌ జిల్లాకు చెందిన ఓ యువతికి బరేలీకి చెందిన యువకుడితో కొద్దినెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం పెళ్లి రోజు కావటంతో పెళ్లికూతురు తరపు వారు బరేలిలోని పెళ్లి కుమారుడి ఇంటికి చేరుకున్నారు. 

మరికొద్ది నిమిషాల్లో తాళి కట్టే శుభఘడియలు (wedding moments) ఆసన్నమవుతుందనగా.. పెళ్లి కుమారుడి స్నేహితులు మద్యం మత్తులో పెళ్లి కూతుర్ని డ్యాన్స్‌ చేయాలంటూ బలవంతంగా డ్యాన్స్‌ చేసే వేదికపైకి లాక్కెళ్లారు. దీనిపై పెళ్లి కుమార్తె  కుటుంబం తీవ్ర అభ్యతరం తెలిపింది. ఈ నేపథ్యంలొ ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. మధ్యలొ పోలీసులను వధువు తరపు వారు రంగంలోకి దింపారు. అధికంగా కట్నం అడుగుతున్నారంటూ పెళ్లి కుమారుడి కుటుంబంపై పెళ్లి కూతురి కుటుంబం ఫిర్యాదు చేసింది. 

పోలీసుల మధ్యవర్తిత్వంతో పెళ్లి కుమారుడి కుటుంబం 6.5 లక్షల రూపాయులు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. పెళ్లి జరిపించటానికి వరుడి తరుపు వారు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. తనకు మర్యాద ఇవ్వని వ్యక్తిని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పడంతో ఆ వరుడు పెళ్లి కాస్తా పెటాకులయింది. 


 

For All Tech Queries Please Click Here..!