93 మందిని రేప్ చేశాడు, తరువాత ఒక్క గుద్దుతో చంపేశాడు

Wednesday, October 23, 2019 04:00 PM Crime
 93 మందిని రేప్ చేశాడు, తరువాత ఒక్క గుద్దుతో చంపేశాడు

అతనో బాక్సర్.. అతని దేహం చాలా దృఢంగా ఉంటుంది. ఒక్క గుద్దు గుద్దితే ఎవరైనా చచ్చిపోవాల్సిందే. చిల్లర దొంగతనాలు చేసుకుంటూ బతికే అతను మొత్తం 93 మందితో శృంగారం జరిపాడు. ఆతరువాత వారందర్నీ హత్య చేశాడు.ఆయన అత్యాచారం చేసిన వారిలో ఎక్కువమంది వ్యభిచారిణులు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు ఉన్నారు. ఇప్పుడు అతని వయసు 73 ఏళ్లు.. అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్, మియామీలలో. దక్షిణ కరోలినా, ఓహాయో, టెక్సాస్‌ సహా 19 రాష్ట్రాల్లో ఈ కిల్లర్ హత్యలు చేశారు. ఆడవాళ్లను నగ్నంగా చేసి శృంగారం అనంతరం వారిని హత్య చేసి రోడ్డు పక్కన చెత్త కుండీల్లో, కాల్వల్లో అలాగే నగ్నంగా పడేసే అలవాటు ఆయనది. కొంత మంది పేర్లు తెలుసుకోకుండానే ఆయన వారితో సెక్స్‌లో పాల్గొని హత్య చేశాడు. అయితే ఎక్కువ మంది బాధితుల ముఖ కవలికలు, వారి వొంపు సొంపులు ఇప్పటికీ ఆయన బాగా గుర్తున్నాయని చెబుతున్నారు. కొత్త వారితో సెక్స్‌ నెరపడానికి పాత ప్రేయసిలు అడ్డు అవుతారనే ఉద్దేశంతోనే ఆయన వారిని వరుసగా హత్యలు చేస్తూ వచ్చాడట. అమెరికా చరిత్రలోనే ఎక్కువ మందిని చంపిన సీరియల్‌ కిల్లర్‌గా ఇప్పుడు అక్కడి పోలీసులు ఆయన్ని గుర్తిస్తున్నారు. 

ఇంతవరకు ఈ కిరాతక రికార్డు లారీ డ్రైవర్‌ గేరి రిడ్జ్‌వే పేరిట ఉండింది. ‘గ్రీన్‌ రివర్‌ కిల్లర్‌’గా పేరు పొందిన అతను 1980 నుంచి 1990 దశకంలో 49 హత్యలు చేశాడు. ఆ తర్వాత మరో 20 హత్యలు చేసినట్లు తాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును కిరాతక కిల్లర్‌ సామ్యూల్‌ లిటిల్‌ అధిగమించాడు. తాను చేసిన 93 మంది మహిళల హత్యల్లో 50 హత్యలను ఒప్పుకున్నాడు. పైగా వారందరి బొమ్మలను గీసి చూపించాడు. ఇంకో 43 హత్యల కేసులను ఆయన అంగీకరించాల్సి ఉంది.అయితే ఫేసులు గుర్తు పట్టకపోవడంతో ఆయన నేరాన్నిఅంగీకరించలేకున్నాడట.. 

1980 దశకంలో జరిగిన ముగ్గురు మహిళల హత్య కేసుల్లో  సామ్యూల్‌ లిటిల్‌కు 2014లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయన ప్రస్తుతం లాస్‌ ఏంజెలిస్‌ జైల్లో పెరోల్‌ కూడా లేకుండా శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాను ఇంతవరకు ఏ అమ్మాయిని రేప్‌ చేయలేదని, ఇష్ట పూర్వకంగానే అమ్మాయిలు తనతో పడుకున్నారని సామ్యూల్‌ వివరించాడు. ఇప్పుడు సామ్యూల్‌ను ఎప్‌బీఐ అధికారులు ఇంటరాగేట్‌ చేస్తున్నారు. ఆ ఇంటరాగేషన్‌ వీడియోలను కూడా మీడియాకు విడుదల చేశారు.

For All Tech Queries Please Click Here..!