లాక్ డౌన్ ఎఫెక్ట్, ఐదుగురు మహిళలు ఆత్మహత్యాయత్నాలు

Wednesday, April 8, 2020 08:42 AM Crime
లాక్ డౌన్ ఎఫెక్ట్, ఐదుగురు మహిళలు ఆత్మహత్యాయత్నాలు

ఇంటిపనులతోపాటు బాహ్య ప్రపంచంలోని పనులను సైతం చక్కబెట్టుకోవడం దాదాపుగా అందరికీ అవసరమే. పనిలేక ఊరకనే ఊరిలో తిరిగేవారు, షాపింగ్‌ పేరుతో చక్కర్లు కొట్టేవారు, స్నేహితులతో షికార్లు కొట్టేవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే ఇలాంటి వారందరికీ అకస్మాత్తుగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ ఒక శాపంగా మారింది అనే చెప్పాలి. ఇంటిపట్టున కదలకుండా ఉండలేక ఏకంగా ఊపిరితీసుకునే పరిస్థితికి చేరుకున్నారు. ఒక్క సేలం జిల్లాలోనే ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం వారిలో ఐదుగురు మహిళలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

వివరాల్లోకి వెళితే కరోనా వైరస్‌ ప్రబలకుండా లాక్‌డౌన్‌ ఉత్తర్వులు అమల్లో ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా తమిళనాడు ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అకారణంగా రోడ్లపైకి వస్తే అరెస్ట్‌లు చేయడం, కేసులు పెట్టడం, వాహనాలను సీజ్‌ చేయడం వంటి కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా, సేలం జిల్లా ఆత్తూరు సమీపం కాట్టుకోటై్ట ప్రాంతానికి చెందిన అయ్యనార్‌మలై (50) అనే వ్యక్తి విషపుమొక్కను పొడిచేసి నీళ్లలో కలుపుకుని సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇరుగూపొరుగూ వారు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స అందిస్తున్నారు. ఆత్తూరు సమీపం పెత్తనాయకన్‌పాళయంకు చెందిన మణికంఠన్‌ (24) అనే యువకుడు విషద్రావకం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్తూరు సమీపం నరసింగపురానికి చెందిన గుణశేఖరన్‌ భార్య సుధ (32) ఎలుకల మందు సేవించి ప్రాణాలుతీసుకునే ప్రయత్నం చేయగా వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: