కొడుకు రేప్ చేస్తుంటే మజా చేసిన తల్లి..

Friday, September 20, 2019 12:46 PM Crime
కొడుకు రేప్ చేస్తుంటే మజా చేసిన తల్లి..

కొడుకు ఓ యువతిపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సిన తల్లి అతడిని పక్కనుండి ప్రోత్సహించింది. ఏకంగా ఆ సన్నివేశాన్ని వీడియో కూడా తీసింది. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. బలోడా బజార్‌కు చెందిన ఓ యువకుడు ఓ యువతితో స్నేహం చేస్తున్నట్లు నటించాడు. ఆమెను ఓ రోజు ఇంటికి పిలిచాడు. అతనిని నమ్మి ఇంటికి వచ్చిన యువతికి. అతడి తల్లి మత్తుపదార్థం కలిపి స్నాక్స్ చేసి పెట్టింది. దీంతో ఆహారం తిన్న తర్వాత ఆ యువతి స్పృహకోల్పోయింది. ఆ తర్వాత ఆమెను తల్లీకొడుకు కలసి బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ యువకుడు తన స్నేహితురాలి మీద అత్యాచారం చేస్తుంటే, దాన్ని ఆ తల్లి వీడియో తీసింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని యువతిని బెదిరించారు. దీంతో బాధితురాలు వారికి రూ.4లక్షలు చెల్లించింది. మరోవైపు ఈ విషయం తెలిసిన యువకుడి సోదరి, ఆమె భర్త కూడా బాధితురాలి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. 

తండ్రి పొలం విక్రయించగా రూ.6లక్షలు వచ్చాయి. ఆ డబ్బులు జాగ్రత్తగా పెట్టాలంటూ కూతురికి ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన డబ్బులను ఆ తల్లీకొడుకులు బ్లాక్ మెయిల్ చేయడంతో రూ.4లక్షలు వారికి ఇచ్చేసింది. అదే సమయంలో ఆ డబ్బులు కావాలని తండ్రి అడగడంతో మిగిలిన రూ.2లక్షలు ఇచ్చింది. రూ.4లక్షలు ఏమయ్యాయని తండ్రి ప్రశ్నించడంతో బాధితురాలు బోరున ఏడ్చింది. ఆ తర్వాత అసలు విషయం చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తల్లీకొడుకులను అరెస్ట్ చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: