భార్య కళ్లముందే మరో యువతితో భర్త ఆపని, తట్టుకోలేక ఏమి చేసిందంటే..!

Wednesday, April 1, 2020 09:16 AM Crime
భార్య కళ్లముందే మరో యువతితో భర్త ఆపని, తట్టుకోలేక ఏమి చేసిందంటే..!

గర్ల్ ఫ్రెండ్ మోజులో పడి కట్టుకున్న భార్యనే చంపాలని అనుకున్నాడో ప్రబుద్ధుడు. కొచ్చిన్ కు చెందిన మీనన్ సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న పూజితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కొన్ని రోజులు ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. పైళ్లైన మూడు నెలల కి ఉద్యోగం పోవడంతో భార్య సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతునాడు. ఈ క్రమంలోనే పాత స్నేహితులతో తిరగడం, జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. ఓ యువతితో పరిచయాన్ని పెంచుకున్నాడు. విషయం తెలిసి మీనన్‌ను భార్య మందలించింది.

దీంతో మరింత రెచ్చిపోయిన మీనన్ యువతితో ఏకంగా ఇంట్లో భార్య ముందే ఆమెతో శృంగారం చేసేవాడు. అదేమని ప్రశ్నించిన భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భరించలేని ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రుల జోక్యంతో కాస్త మారినట్టు నటించాడు. ఇటీవల భార్యాభర్తలు బెంగళూరు మకాం మార్చారు. ఇక్కడికి వచ్చినా మళ్లీ మొదటికే వచ్చాడు మీనన్. మరో అమ్మాయిని వివాహం చేసుకోవడానికి పథకం రచించాడు. ఈ నేపథ్యంలోనే భార్యను హత్య చేయాలని ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: