డాక్టర్ సుధాకర్ సంచలన వాగ్మూలం, లేడీ కానిస్టేబుల్‌తో అలా చేయించి నన్ను కొట్టారు. వాంగ్మూలంలో తిట్ల జాడే లేదు.

Sunday, May 24, 2020 04:35 PM Crime
డాక్టర్ సుధాకర్ సంచలన వాగ్మూలం, లేడీ కానిస్టేబుల్‌తో అలా చేయించి నన్ను కొట్టారు. వాంగ్మూలంలో తిట్ల జాడే లేదు.

ఎన్-95 మాస్కులు లేవని సీఎం ని తిడుతూ వీడియో విడుదలచేసిన వివాదంలో సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకువిశాఖ మెజిస్ట్రేట్ శనివారం రాత్రి కీలక వాగ్మూలాన్ని రికార్డు చేశారు.

అందులో డాక్టర్ సుధాకర్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. డాక్టర్ ను అరెస్టు చేసిన తీరును తప్పుపట్టిన హైకోర్టు విచారణను సీబీఐకి బదిలీచేయడం, 8 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించడం తెలిసిందే.

మాస్కుల కొరత అంశం మొదలుకొని ఏప్రిల్ 8న అంబులెన్స్ డ్రైవర్ ద్వారా సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకోవడం ఈనెల 16న నడిరోడ్డుపై పోలీసులు అరెస్టు చేసిన తీరు దాకా అన్ని వివరాలను ఆయన పూసగుచ్చినట్లు మెజిస్ట్రేట్ కు వివరించారు. డాక్టర్ అరెస్టుపై టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారిస్తున్న క్రమంలో స్టేట్మెంట్ రికార్డునకు ఆదేశించింది.

ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నా కొడుకు బైక్ ను సీజ్ చేసి తీసుకెళ్లారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు నేను 4వటౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. అక్కడ అనూహ్య రీతిలో ఓ లేడీ కానిస్టేబుల్ నా చెయ్యి గట్టిగా పట్టుకుని రివర్స్ లో నేనేదో చేసినట్లు వదిలిపెట్టండీ అని ఏడ్చింది. మరుక్షణంలోనే పోలీసులు నన్ను చుట్టుముట్టి విపరీతంగా కొట్టారు. ఈ కేసుతో సస్పెన్షన్ కాదు.. ఏకంగా డిస్మిస్ చేయిస్తామని బెదిరించి, విడిచిపెట్టారు.

ఇన్ని పాయింట్లు వాగ్మూలంలో చెప్పిన డాక్టర్ సుధాకర్ , సీఎం జగన్ , పీఎం మోడీ , ముస్లిం అండ్ క్రిస్టియన్ మతాలని ఎందుకు తిట్టాడో చెప్పకపోవటం కొస మెరుపు.

For All Tech Queries Please Click Here..!
Topics: