WhatsApp OTP Scam: వాట్సాప్ ఓటీపీ స్కాం అంటే ఏమిటి? ఖాతాను ఎలా హ్యాక్ చేస్తారు ? 

Wednesday, January 6, 2021 12:00 PM Crime
WhatsApp OTP Scam: వాట్సాప్ ఓటీపీ స్కాం అంటే ఏమిటి? ఖాతాను ఎలా హ్యాక్ చేస్తారు ? 

 దీనివల్ల మీ వాట్సాప్ అకౌంట్ లోకి (WhatsApp Account) సులభంగా ప్రవేశించడంతో పాటు కీలకమైన సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. అది ఎలా జరుగుతుందో ఓ సారి చూద్దాం. 

ముందుగా మీకు మీ స్నేహితుడి పేరుతో తెలియని నంబర్‌ నుంచి మెసేజ్‌ వస్తుంది. తన ఫోన్‌‌ నెంబర్ పనిచేయడంలేదని.. వాట్సాప్‌ ఖాతా వేరే ఫోన్‌లో ఉపయోగించేందుకు ఓటీపీ కోసం నీ ఫోన్‌ నంబర్‌ ఇచ్చానని.. ఆ ఓటీపీని తనకు పంపించాలని దాని సారాంశంగా ఉంటుంది.వెంటనే వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే అది స్కాం అని తెలుస్తుంది. అందుకోసమే మీకు వేరే నెంబర్ నుండి ఓటీపీ వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

ఇలాంటి ఓటీపీలు రాగానే వెంటనే మీకు వచ్చిన  పేరు ఉన్న ఆ స్నేహితుడికి నార్మల్ కాల్ చేసి వివరాలు కనుక్కోవడం మంచింది. ఒక వేళ మీరు ఓటీపీ కోడ్‌ను హ్యాకర్‌కు పంపితే, మీ మిత్రుడు తన స్వంత వాట్సాప్ ఖాతాకు తిరిగి లాగిన్ కాలేరు. అప్పుడు మీ మిత్రుడి ఖాతాపై పూర్తి నియంత్రణ హ్యాకర్ చేతికి వెళ్తుంది. వెంటనే మీ మిత్రుడి ఖాతాలోని ముఖ్యమైన సమాచారాన్ని చోరీ చేయడంతో పాటు మిమ్మల్ని డబ్బులు కూడా అడిగే అవకాశం ఉంది. మళ్ళీ ఇదేవిదంగా మీ ఇతర స్నేహితుల ఖాతాలను కూడా హ్యాక్ చేయవచ్చు.

అందుకని మనం, మనకు తెలియని నెంబర్ నుండి ఎటువంటి సందేశం వచ్చిన స్పందించకపోవడం మంచిది. అలానే మీ వాట్సాప్‌ ఖాతాకు టూ-స్టెప్‌ వెరిఫేకేషన్‌ను ఎనేబుల్ చేసుకోవడం చాలా మంచిది. దాని వల్ల ఓటీపీతో పాటు ఖాతా వెరిఫికేషన్‌కి ప్రత్యేక పిన్‌ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల పొరపాటున మీరు ఓటీపీ పంపినా పిన్‌ నంబరు ఉండదు కాబట్టి మీ ఖాతాను హ్యాక్‌ చేయలేరు. ఒక వేళ ఓటీపీ పంపి మీ ఖాతా హ్యాక్ అయితే వెంటనే మీ వాట్సాప్‌ని రీసెట్ చేసి తిరిగి లాగిన్ అవ్వండి.

For All Tech Queries Please Click Here..!