ప్రేమించిన ప్రియురాలే..మరో వ్యక్తితో గర్భవతి అయ్యింది...ఇప్పుడు  ప్రియుడిని పెళ్లిచేసుకోమని..దారుణం...

Thursday, October 22, 2020 03:00 PM Crime
ప్రేమించిన ప్రియురాలే..మరో వ్యక్తితో గర్భవతి అయ్యింది...ఇప్పుడు  ప్రియుడిని పెళ్లిచేసుకోమని..దారుణం...

నిజమైన ప్రేమకు నేడు అర్థాలు మారిపోయాయి. మోసం, స్వార్థం, తాత్కాలిక శారీరక సుఖమే ప్రేమపేరుతో ఇప్పుడు చెలామణి అవుతున్నాయి. ప్రాణంగా ప్రేమించి ప్రియురాలే, అతడిని దారుణంగా మోసం చేసింది. మరో వ్యక్తితో శారీరక సుఖం పొంది, గర్భవతి అయ్యింది.  అంతేకాదు అతడి నుంచి విడిపోయి, ఇప్పుడు అమాయకంగా ప్రేమించిన మరో ప్రియుడినే దోషిగా నిలిపి పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది. దీంతో ఆ ప్రియుడు అసలు విషయం తెలిసి షాక్ తిన్నాడు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన దినేష్ (పేరు మార్చాం) ఇంటర్మీడియట్ లో తన క్లాస్ మేట్ అర్చనను నిజాయితీగా ప్రేమించాడు. అర్చన మొదట అతడిని అసహ్యించుకుంది. కానీ ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత దినేష్ తో ప్రేమ స్టార్ట్ చేసింది. కొద్ది కాలంలోనే ఇద్దరి మధ్య ప్రేమ గాఢంగా మారింది. అర్చన కూడా సిన్సియర్ గానే దినేష్ ను ప్రేమించింది. దినేష్ తన ప్రియురాలు అర్చన కోసం అనేక పార్ట్ టైం జాబ్ చేసి మరీ విలువైన కానుకలు కొనేవాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు. ఈ క్రమంలో రాజేష్ రూపంలో మరో వ్యక్తి వారి జీవితంలోకి ప్రవేశించాడు. రాజేష్ జూనియర్ లెక్చరర్ గా కాలేజీలో చేరాడు. అతడి కన్ను అర్చనపై పడింది. అర్చన అందానికి అతడు ముగ్ధుడయ్యాడు. ఆమెను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు.

అర్చన ఫోన్ నెంబర్ తెలుసుకున్న రాజేష్ తరచూ ఆమెకు ఫోన్ చేసేవాడు. అర్చనకు మాయమాటలు చెప్పేవాడు. ఆ మాటలకు ఆమె పడిపోయింది. తన ప్రియుడు దినేష్ కన్నా కూడా రాజేష్ ఆస్తిపరుడని భావించింది. అలాగే అతడికి మంచి జాబ్ కూడా త్వరలోనే వస్తుందని నమ్మింది. దీంతో దినేష్ ను పక్కకు పెట్టి...ఇక రాజేష్ తో తన ప్రేమ ప్రయాణం సాగించాలనుకుంది. దినేష్ ను దూరం పెట్టడం ప్రారంభించింది. కానీ దినేష్ మాత్రం అర్చనను గుడ్డిగా నమ్మాడు. ఎప్పటి కైనా అర్చన తన భార్య అవుతుందని భావించాడు. కానీ ఇంతలోనే అతడికి అనుకోని షాక్ తగిలింది. జూనియర్ లెక్చరర్ రాజేష్ తో తన ప్రియురాలు చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం అతడి కంట పడింది.

ఈ విషయమై అర్చనను నిలదీయగా, అతడు తనకు బంధవు అవుతాడని అందుకే తిరిగానని నమ్మించింది. మరోవైపు రాజేష్ కూడా అర్చనను ఇక ఎక్కువ కాలం తన వెంట తిప్పుకోవడం మంచిది కాదని భావించాడు. ఓ రోజు తన గదికి తీసుకెళ్లి అర్చనకు మాయమాటలు చెప్పి తన శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. అర్చన కూడా గుడ్డిగా అతడికి తన శరీరాన్ని అర్పించుకుంది. రాజేష్ తరచూ ఆమెను తన గదికి తీసుకెళ్లి రాసలీలలు ఆడేవాడు. అయితే రాజేష్ తనకు సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందని హైదరాబాద్ వెళ్లిపోయాడు. త్వరలోనే వచ్చి అర్చనను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. ఇదే విషయం రాజేష్ కు తెలపాలని ట్రై  చేసింది. అతడు ఫోన్ నెంబర్ మారిపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతడి జాడ దక్కలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు.

ఇంతలో అర్చన ఇంట్లో ఆమె గర్భవతి అన్న సంగతి తెలిసింది. దీనికి కారణం ఎవరని నిలదీయగా తన గర్భానికి దినేష్ తో ప్రేమే కారణమని ఇంట్లో వారిని నమ్మించింది. అయితే దీంతో అర్చన కుటుంబ సభ్యులు దినేష్ ను నిలదీశారు. అతడు షాక్ కు గురయ్యాడు. తనకు ఎలాంటి సంబంధం లేదని వాపోయాడు. అయితే అర్చన, దినేష్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని వారి సన్నిహితులందరికీ చాలా కాలంగా తెలిసిన విషయమే.... అయితే తనను ప్రేమించిన ప్రియురాలు ఇంతలా మోసం చేస్తుందని దినేష్ కలలో కూడా అనుకోలేదు. దినేష్ ను పెళ్లి చేసుకోమని అర్చన కుటుంబసభ్యులు ఒత్తిడి చేశారు. లేకపోతే పోలీసు కేసు పెడతామని బెదిరించారు.

దీంతో ఏం చేయాలో తెలియక దినేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి అతడు ప్రాణాపాయ స్థితిలో వారి పొలంలో పడిపోగా, అటుగా వెళుతున్న కొందరు రైతులు సకాలంలో ఆసుపత్రికి చేర్చి బతికించారు. దినేష్ తనకు జరిగిన విషాద గాథను ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ రూపంలో తెలిపాడు. అచ్చం RX100 సినిమాతో పోలిన ఈ యదార్థ గాథ భగ్న ప్రేమికులను కదిలిస్తోంది.  

For All Tech Queries Please Click Here..!