ఎమ్మెల్యే హత్య కేసు : ఇదీ తాజా పరిస్థితి

Saturday, December 15, 2018 12:46 PM Crime
ఎమ్మెల్యే హత్య కేసు : ఇదీ తాజా పరిస్థితి

ఎమ్మెల్యే సర్వేశ్వరరావు హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా సెస్టెంబర్ 23వతేదీన గ్రామదర్శిని కార్యక్రమానికి వెళుతుండగా నిషిద్ధ మావోయిస్టులు కాల్పులు జరపడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.  ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యతో సంబంధం ఉన్న యెండల సుబ్బారావు, శోభన్, ఈశ్వరి, కొర్రా కమలను ఎన్ఐఏ అధికారులు ఈనెల 6తేదీన అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతుండగా మరికొంతమంది నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు సమాచారం.