బాయిలర్ పేలి ఆరుగురు దుర్మరణం

Sunday, December 16, 2018 05:54 PM Crime
బాయిలర్ పేలి ఆరుగురు దుర్మరణం

కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా ముథోల్ లో ఉన్న నిరానీ ఘగర్స్ ప్యాక్టరీలో బాయిలర్ పేలి ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడగా, అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాయిలర్ పేలుడు జరిగిన వెంటనే కార్మికులు కంపెనీలో నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి ఘగర్ ఫ్యాక్టరీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పై కప్పులు ఎగిరిపోగా, పిల్లర్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, కార్మికులు సహాయకచర్యలు ప్రారంభించారు.