మళ్లీ తగ్గిన పెట్రో ధరలు: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ధరలు

Saturday, December 8, 2018 12:31 PM Business
మళ్లీ తగ్గిన పెట్రో ధరలు: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ధరలు

దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు శనివారం (డిసెంబరు 8) ఓ మోస్తారుగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 22 పైసలు తగ్గి రూ.70.70 కి చేరుకోగా.. డీజిల్ ధర 25 పైసలు తగ్గి రూ. 65.30 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోలు ధర 22 పైసలు తగ్గి రూ.76.28 ఉండగా.. డీజిల్ ధర 27 పైసలు తగ్గి రూ.68.32 కు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లోని హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర 23 పైసలు తగ్గి రూ.74.95 మరియు డీజిల్ ధర 27 పైసలు తగ్గి రూ.70.94 కు చేరుకున్నాయి. విజయవాడలో పెట్రోల్‌ ధర 50 పైసలు తగ్గి రూ.74.48 ఉండగా.. డీజిల్‌ ధర o.46 పైసలు తగ్గి రూ.70.11 గా ఉంది.