ఇకపై గెలాక్సీ ఎస్, నోట్ సీరిస్ ఫోన్లు కనపడవు, కొత్త సీరిస్ పేరు గెలాక్సీ వన్

Wednesday, October 9, 2019 04:01 PM Business
ఇకపై గెలాక్సీ ఎస్, నోట్ సీరిస్ ఫోన్లు కనపడవు, కొత్త సీరిస్ పేరు గెలాక్సీ వన్

శాంసంగ్ (Samsung) యూజర్లకు, అభిమానులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ కంపెనీ నుంచి వచ్చి అందర్నీ అలరించిన గెలాక్సీ ఎస్ సిరీస్, నోట్ సిరీస్ ఫోన్లకు ఇకపై ఫుల్‌స్టాప్ పెట్టనున్నట్లు తెలిసింది. ఆ సిరీస్‌లో ఇకపై కొత్త స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ విడుదల చేయబోవడం లేదని తెలిసింది. ఈ నిర్ణయంతో గెలాక్సీ ఎస్10, ( Galaxy S10 ) గెలాక్సీ నోట్ 10 ( Galaxy Note 10 )లతోనే ఆ సిరీస్‌లు ముగియనున్నాయి. శాంసంగ్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త వ్యూహం కూడా దాగి ఉన్నట్లు తెలుస్తోంది.

గెలాక్సీ ఎస్ సిరీస్‌( Galaxy S series) లో ఇప్పటి వరకు శాంసంగ్ కంపెనీ 10 ఫోన్లను, నోట్ సిరీస్‌లో 9 ఫోన్లు వచ్చాయి. కంపెనీ ఎప్పుడు ఈ రెండు సిరీస్‌లలో కొత్త ఫోన్లను విడుదల చేసినా ఆ ఫోన్లలో అందించే ఫీచర్లు దాదాపుగా ఒకే రకంగా ఉంటున్నాయి. దీంతో వినియోగదారులు గెలాక్సీ నోట్ ఫోన్లను కాకుండా గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లను కొనేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారట. ఈ క్రమంలోనే ఎస్ సిరీస్, నోట్ సిరీస్‌లకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ రెండు సిరీస్‌లను కలిపి గెలాక్సీ వన్ పేరిట ఓ కొత్త సిరీస్‌ను లాంచ్ చేసే యోచనలో శాంసంగ్ ఉన్నట్లు తెలిసింది. త్వరలో ఈ సీరిస్ నుంచి రానున్న ఫోన్ గెలాక్సీ ఎస్ 10 ( Galaxy S10 ) సక్సెసర్ గా తీసుకురాబోతోంది. ఆకట్టుకునే ఫీచర్లతో 2020 ఫస్ట్ క్వార్టర్ లో ఈ ఫోన్ రానుంది. దీంతో పాటుగా గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్లు కూడా కొత్తగా మార్కెట్లోకి రానున్నాయి. అయితే దీనిపై శాంసంగ్ నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. త్వరలోనే తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

భారత్‌లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్, గెలాక్సీ ఎం30ఎస్ , ధర, ఫీచర్లు ఇవే
గెలాక్సీ ఎం30ఎస్
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ధర రూ.13,999. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ధర రూ.16,999. ఈ నెల 29వ తేదీ నుంచి అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ షాప్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ ఫీచర్లు
6.4 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0, డ్యుయల్ సిమ్, 48, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

గెలాక్సీ ఎం10ఎస్, ధర రూ.8,999
శాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్ ఫీచర్లు
6.4 ఇంచుల డిస్‌ప్లే, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884బి ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: