Toyota Glanza: టయోటా గ్లాంజా విడుదల... ఎలా ఉందో తెలుసా?

Thursday, June 6, 2019 05:03 PM Automobiles
Toyota Glanza: టయోటా గ్లాంజా విడుదల... ఎలా ఉందో తెలుసా?

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త గ్లాంజా కారును ప్రవేశపెట్టింది. టయోటా గ్లాంజా కారును నాలుగు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి  తెచ్చిన సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. టయోటా గ్లాంజా కారు గురించి వివరంగా తెలుసుకుందాం రండి...

మారుతి సుజుకి సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం బాలెనో అనే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసింది. ఇప్పుడు టయోటా మోటార్స్ ఇదే మారుతి బాలెనో కారును రీ-బ్యాడ్జ్ వెర్షన్‌తో అదే డిజైన్‌లో మరిన్ని నూతన ఫీచర్లను అందించి గ్లాంజా పేరుతో విపణిలోకి ప్రవేశపెట్టింది. అనగా.. పేరు, కారులోని విలాసవంతమైన ఫీచర్లు మినహాయిస్తే డిజైన్ మరియు ఇంజన్ మారుతి బాలెనో కారునే పోలి ఉంటుంది. గత ఏడాది సుజుకి-టయోటా కంపెనీల మధ్య ఉమ్మడి భాగస్వామ్యం ఏర్పడింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇరు సంస్థలు తమ ఉత్పత్తులను పంచుకుని విక్రయించడంతో పాటు నూతన ఉత్పత్తులను అభవృద్ది చేసి, ఉమ్మడిగా వినియోగించుకుంటారు. ఇదే తరహాలో మారుతి సుజుకి పలు టయోటా కార్లను కొత్త పేర్లతో తమ షోరూముల్లో విక్రయించనుంది.

టయోటా గ్లాంజా నాలుగు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. అవి..
గ్లాంజా వి సీవీటి - ధర రూ. 8,90,200
గ్లాంజా జి సీవీటి - ధర రూ. 8,29,900
గ్లాంజా వి మ్యాన్యువల్ - ధర రూ. 7,58,200
గ్లాంజా జి మ్యాన్యువల్ - ధర రూ. 7,21,900
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.

టయోటా గ్లాంజా ఇంజన్ వివరాలు
టయోటా గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో సాంకేతికంగా 1.2-లీటర్ కెపాసిటీ గల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలదు. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

టయోటా గ్లాంజాలోని ఫీచర్లు

  • పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు గల ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
  • లైట్ గైడ్ ఫీచర్ గల ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్
  • డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
  • స్మార్ట్ ఆధారిత న్యావిగేషన్ సిస్టమ్
  • ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే ప్లేకాస్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ 
  • స్టీరింగ్ ఆధారిత ఆడియో, ఫోన్ కాల్స్ &  వాయిస్ కమాండ్ సిస్టమ్
  • ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్
  • ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్
  • ఇంజన్ స్టార్ట్/స్టాప్ ద్వారా స్మార్ట్ ఎంట్రీ

టయోటా గ్లాంజాలోని సేఫ్టీ ఫీచర్లు

  • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు
  • యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
  • రివర్స్ పార్కింగ్ కెమెరా
  • ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్

For All Tech Queries Please Click Here..!