షాకింగ్ ధరతో విడుదలైన టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్

Tuesday, September 10, 2019 05:00 PM Automobiles
షాకింగ్ ధరతో విడుదలైన టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్

టాటా మోటార్స్ మార్కెట్లోకి నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీ క్రేజ్ మరియు క్రేజ్+ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇది వరకే అందుబాటులో ఉన్న నెక్సాన్ ఎస్‌యూవీని క్రేజ్ ఎడిషన్ పేరుతో పరిమిత సంఖ్యలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 

టాటా నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుండటంతో రెగ్యులర్ వేరియంట్ల మాదిరిగా కాకుండా రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. టాటా నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్‌లోని క్రేజ్ వేరియంట్ ధర రూ. 7.57 లక్షలు మరియు హై-ఎండ్ వేరియంట్ క్రేజ్+ ధర రూ. 8.17 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుండి నెక్సాన్ క్రేజ్ కంపెనీ యొక్క రెండవ లిమిటెడ్ ఎడిషన్. గత ఏడాది కూడా నెక్సాన్ ఎస్‌యూవీని క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. నెక్సాన్ ఎస్‌యూవీ పది లక్షల సేల్స్ మైలురాయిని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్‌ను మరో మారు తీసుకొచ్చారు. 

ఎక్ట్సీరియర్‌ రెగ్యలర్ నెక్సాన్‌తో పోల్చుకుంటే ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆల్ బ్లాక్ బాడీ పెయింటింగ్, అక్కడక్కడ కాషాయపు రంగు సొబగులు కారు మొత్తానికి ఆకర్షణీయమైన లుక్ తీసుకొచ్చాయి. ఇంటీరియర్‌లో కూడా పలుకాస్మొటిక్ మెరుగులు దిద్దారు. ఓవరాల్‌గా నెక్సాన్ క్రేజ్ చూడ్డానికి స్పోర్టివ్ మరియు స్టైలిష్‌గా ఉంది.

సాంకేతికంగా టాటా నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్ అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. వీటిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 మరియు మారుతి సుజుకి వితారా బ్రిజా వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

For All Tech Queries Please Click Here..!
Topics: